Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

"నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు"... టీమిండియా క్రికెట‌ర్‌ చాహ‌ల్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌!

Yuzvendra Chahal Cryptic Post on Valentines Day
Advertisement
  • గ‌త కొంత‌కాలంగా చాహ‌ల్, ధ‌న‌శ్రీ వ‌ర్మ విడాకులపై నెట్టింట‌ జోరుగా ప్ర‌చారం
  • ఈ క్ర‌మంలో వాలంటైన్స్ డే నాడు సోష‌ల్ మీడియా వేదిక‌గా క్రికెట‌ర్‌ ఆస‌క్తిక‌ర పోస్టు 
  • ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్న పోస్టు
  • ఇది త‌ప్ప‌కుండా అత‌ని వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిందేనని ఫ్యాన్స్‌ కామెంట్  
Advertisement
టీమిండియా స్టార్ స్పిన్న‌ర్ యుజ్వేంద్ర‌ చాహ‌ల్, ధ‌న‌శ్రీ వ‌ర్మ విడాకులకు రెడీ అవుతున్నారంటూ గ‌త కొంత‌కాలంగా నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల చాహ‌ల్ త‌న ఇన్‌స్టా ఖాతా నుంచి భార్య ఫొటోల‌ను తొల‌గించ‌డంతో ఆ ప్ర‌చారానికి మ‌రింత ఊతమిచ్చినట్లయింది. అయితే, ప్రేమికుల రోజు సంద‌ర్భంగా చాహ‌ల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్టు చేశాడు. ప్ర‌స్తుతం ఆ పోస్టు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. 

"నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు... ఇత‌రులు నీ జీవితాన్ని మార్చేందుకు అనుమ‌తించ‌కు" అని చాహ‌ల్ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. దాంతో ప్ర‌స్తుతం ఈ పోస్టు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇక చాహ‌ల్ ఈ పోస్టు దేనిగురించి పెట్టాడనే విష‌యంలో క్లారిటీ లేదు. అయితే, చాహ‌ల్‌ ఫ్యాన్స్ మాత్రం ఇది త‌ప్ప‌కుండా అత‌ని వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిందేనని వ్యాఖ్యానిస్తున్నారు. 

కాగా, ఇప్ప‌టికే చాహ‌ల్, ధ‌న‌శ్రీ ఒక‌రినొక‌రు ఇన్‌స్టాలో అన్‌ఫాలో కూడా చేసుకున్నారు. దీంతో ఈ దంప‌తుల విడాకులపై జోరుగా వార్త‌లు ప్ర‌చారమ‌వుతున్నాయి. ఇలా త‌మ విడాకుల‌పై ఊహాగానాలు పెర‌గ‌డంతో చాహ‌ల్ స్పందించాడు. "నెట్టింట వ‌స్తున్న వార్తలు నిజం కావ‌చ్చు... కాక‌పోవ‌చ్చు" అని పోస్టు చేశాడు.     
Advertisement
Advertisement
Yuzvendra Chahal
Valentines Day
Instagram

More Telugu News